హేమ..శ్రీకాంత్..ఆషిలకు నోటీసులు
నోటీసులు పంపిన సీసీబీ
బెంగళూరు – నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన టాలీవుడ్ రంగానికి చెందిన సినీ నటులు హేమ, శ్రీకాంత్ మేఖ, ఆషి రాయ్ లకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు కేంద్రంగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సంఘటనలో 103 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో మహిళలు, పురుషులు ఉన్నారు.
వీరంతా ప్రముఖ రాజకీయ , సినీ రంగానికి చెందిన వారు కావడం గమనార్హం. మొత్తం 103 మందికి గాను 86 మందికి డ్రగ్స్ టెస్టుల్లో 86 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అందరికీ నోటీసులు పంపించే పనిలో పడింది సీసీబీ.
తాజాగా బెంగళూరు ఫామ్ హౌజ్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేసింది నటి హేమ. ఇక అది కేవలం బర్త్ డే పార్టీ మాత్రమేనని తాను క్యాజువల్ గా హాజరయ్యానంటూ తెలిపింది ఆషి రాయ్.
ఇక సినీ నటులు హేమ, ఆషి , శ్రీకాంత్ లకు నోటీసులు పంపించింది సీసీబీ.