అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
బంగ్లాదేశ్ – స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రూ. 3,00,000 డాలర్ల కంటే ఎక్కువ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన కోర్టు వెంటనే తనను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది.
ఇదే కేసుకు సంబంధించి కోర్టు గతంలో షకీబ్ కు సమన్లు కూడా జారీ చేసింది. కానీ ఆయన నిర్లక్ష్యం చేశాడు. కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. దీంతో వారెంట్ జారీ చేసిందని లాయర్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా గత ఏడాది 2024లో బంగ్లాదేశ్ నుండి పారి పోయి భారత దేశంలో తలదాచుకుంటున్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యుడిగా ఉన్నాడు షకీబ్ అల్ హసన్. హసీనాతో ఆయనకున్న సంబంంధాల పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే హసీనా సర్కార్ కూలి పోయినప్పుడు షకీబ్ అల్ హసన్ కెనడాలో జరిగిన దేశీయ టి20 క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కు రాలేదు. బంగ్లాదేశ్ తరపున ఈ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ 71 టెస్టులు, 247 వన్డేలు , 129 టి20 మ్యాచ్ లు ఆడి మొత్తం 712 వికెట్లు పడగొట్టాడు.
వచ్చే నెలలో పాకిస్తాన్ , దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే వన్డే అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టులో అతను లేడు.