షేక్ హసీనా కొంప ముంచిన ఆర్మీ చీఫ్
తను స్వయంగా బంధువు కానీ రాబంధువు
బంగ్లాదేశ్ – దేశ ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినా ఇంకా బంగ్లాదేశ్ లో మంటలు చల్లారడం లేదు. రిజర్వేషన్ ప్రక్రియ కొంప ముంచేలా చేసింది. అంతకు మించి విస్తు పోయేలా చేసింది ఏమిటంటే తను నమ్మిన ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ నట్టేట ముంచడం.
ఆర్మీ చీఫ్ ఎవరో కాదు మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దగ్గరి బంధువు. అతడిని ఏరికోరి నియమించింది. విచిత్రం ఏమిటంటే ఆమెను అధికారం నుండే కాక దేశం నుంచి పారి పోయేలా చేశాడు . అంతే కాదు రాజీనామా చేయాలని, దేశం విడిచి వెళ్లేందుకు కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చాడు.
దాదాపు 30 ఏళ్ల ఆర్మీ కెరీర్ లో వాకర్ ఉజ్ జమాన్ షేక్ హసీనాతో సన్నిహితంగా పని చేశాడు. తలలో నాలుకగా ఉన్నాడు. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఆర్మ్ డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సపల్ స్టాఫ్ ఆఫీసర్ గా పని చేశాడు.
దీంతో షేక్ హసీనా వాకర్ ఉజ్ జమాన్ ను నమ్ముకుంది. చివరకు తను నమ్మిన వాడే తనను వెళ్లగొట్టేలా చేస్తాడని అనుకోలేదు కలలో కూడా.