బంగ్లాదేశ్ కాన్సులేట్ పై దాడులు
న్యూయార్క్ లో చోటు చేసుకున్న ఘటన
అమెరికా – బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతున్నట్లు ప్రకటించారు ఆర్మీ చీఫ్. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాలను తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయినా నిరసనలు ఆగడం లేదు.
ప్రజలు రోడ్లపైకి వచ్చారు. షేక్ హసీనా ఇల్లు లూటీ చేశారు . బంగ్లాదేశ్ కు చెందిన రాడికల్స్ రెచ్చి పోతున్నారు. దాడులకు తెగ బడుతున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ కాన్సులేట్ లను టార్గెట్ చేశారు.
విధ్వంసాలకు దిగుతుండడంతో ప్రతి చోటా ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం అమెరికా రాజధాని న్యూయార్క్ లో బంగ్లాదేశ్ కాన్సులేట్ పై ఆందోళనకారులు దాడులకు దిగారు. బంగ్లా బంధుగా పేరు పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఫోటోలను తొలగించారు. ఈ ఘటనలతో యావత్ ప్రపంచం విస్తు పోతోంది.