NEWSINTERNATIONAL

బంగ్లాదేశ్ లో సోష‌ల్ మీడియాపై నిషేధం

Share it with your family & friends

ఉక్కు పాదం మోపిన షేక్ హ‌సీనా స‌ర్కార్

బంగ్లాదేశ్ – సామాజిక మాధ్య‌మాల‌కు బిగ్ షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం. శ‌నివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనా ఆదేశాల మేర‌కు సోష‌ల్ మీడియాకు చెందిన ప‌లు సంస్థ‌ల‌పై ఉక్కు పాదం మోపుతున్న‌ట్లు పేర్కొంది.

ఇందులో ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ లో కొన‌సాగుతున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టా గ్రామ్ , చైనాకు చెందిన టిక్ టాక్ , జుక‌ర్ బ‌ర్గ్ కు చెందిన వాట్సాప్ , ర‌ష్యాకు చెందిన టెలిగ్రామ్ ల‌తో పాటు గూగుల్ కు చెందిన యూట్యూబ్ పై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం.

ఇదిలా ఉండ‌గా నిన్న‌టి నుండి బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ లు ప‌ని చేయ‌డం లేకుండా పోయింది. కొంత మేర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసిన‌ట్లు స‌మాచారం. కోటా వ్య‌తిరేక నిర‌స‌న‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా జూలై 17 నుండి 31 వ‌ర‌కు ఫేస్ బుక్, వాట్సాప్ , ఇన్ స్టా లు కంటిన్యూగా బ్యాన్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని పేర్కొంటున్నారు అక్క‌డి జ‌నం.