జమాత్ – ఇ- ఇస్లామీ సంస్థపై నిషేధం ఎత్తివేత
భారత దేశ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ హెచ్చరిక
బంగ్లాదేశ్ – భారత దేశానికి బిగ్ షాక్ ఇచ్చింది మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం. ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మత ఛాందస వాదులకు, సంస్థలకు తమ వద్ద చోటు లేదని ప్రకటించింది. అంతే కాకుండా బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులు, క్రిష్టియన్లు, మైనార్టీల పట్ల దాడులు తగదని పేర్కొంది. చర్యలు తీసుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు పీఎం నరేంద్ర మోడీ.
దీనికి నిరసనగా కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యంతర ప్రభుత్వ ప్రధాన మంత్రి మహమ్మద్ యూనస్. ఒక రకంగా భారత దేశానికి హెచ్చరిక చేయడం విస్తు పోయేలా చేసింది. బుధవారం యూనస్ సర్కార్ కీలక ప్రకటన చేసింద.ఇ
జమాత్ – ఇ- ఇస్లామీపై ఇప్పటి వరకు విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా జమాతే ఇస్లామీకి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లభించ లేదని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
అంతే కాకుండా దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్‌పై నిషేధాన్ని కూడా రద్దు చేసింది. ఇడా-అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ చీఫ్ జషీముద్దీన్ రహ్మానీని కూడా తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ విడుదల చేశారు.