NEWSINTERNATIONAL

ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామా చేయాలి

Share it with your family & friends

తాజా ఘ‌ర్ష‌ణ‌ల్లో 72 మందికి పైగా మృతి

బంగ్లాదేశ్ – దేశ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. తాజాగా చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల్లో ప‌లువురు పోలీసుల‌తో స‌హా 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆందోళ‌న‌కారులు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వేలాది మంది విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు తమ పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేశారు. అంతే కాకుండా స్వ‌చ్చంధంగా వెదురు కర్రలతో, ఆయుధాలతో రావాలని ప్రజలను కోరారు. పౌరులు ఎవ‌రూ కూడా ప‌న్నులు చెల్లించ వ‌ద్ద‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా కొంత మంది మాజీ సైనికాధికారులు సైతం ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లక‌డం విశేషం.

1971 స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం 30 శాతం కోటా ఇవ్వడాన్ని బంగ్లాదేశీయులు వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న హింసాకాండ‌ కారణంగా, సుప్రీంకోర్టు కోటాను 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు ఈ అల్ల‌ర్ల‌లో. అశాంతిని అణిచివేసేందుకు అధిక శక్తిని ఉపయోగించినందుకు నిరసనకారులు ఇప్పటికీ షేక్ హసీనా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.