బంగ్లాదేశ్ టీవీ జర్నలిస్ట్ మృతి
హిందువుల గురించి రిపోర్ట్
బంగ్లాదేశ్ – ప్రముఖ బంగ్లాదేశ్ టీవీ జర్నలిస్ట్ సారా రహనుమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె గత కొంత కాలంగా బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులు, క్రిష్టియన్లు, ఇతర వర్గాలపై జరుగుతున్న పాశవిక దాడుల గురించి నిర్భయంగా ప్రసారం చేస్తూ వచ్చింది. దీంతో మత ఛాందసవాదులు తట్టుకోలేక సారా రహనుమా ను పొట్టన పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సారా రహనుమా మృత దేహం ఢాకా సరస్సులో లభ్యం కావడంతో ఒక్కసారిగా ప్రసార మాధ్యమాలకు చెందిన జర్నలిస్టులు విస్మయానికి లోనయ్యారు. సారా రహనుమా జీటీవీకి చెందిన సెక్యులర్ ఛానెల్ లో బంగ్లాదేశ్ నుంచి టీవీ జర్నలిస్టుగా పని చేస్తోంది.
ఈ ఛానల్ ప్రధానంగా హిందువులపై జరిగిన అకృత్యాలపై విస్తృతంగా టెలికాస్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఛానెల్ యజమాని గోలం దస్తగిర్ ను కూడా అరెస్ట్ చేయడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. కాగా సారా రహనుమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ మాజీ పీఎం కుమారుడు నజీబ్ వాజెద్ స్పందించారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై క్రూరమైన దాడిగా పేర్కొన్నారు.