రాహుల్..రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కామెంట్
ఢిల్లీ – భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని దానిని పదే పదే ప్రదర్శిస్తూ అపహాస్యం చేయొద్దని స్పష్టం చేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా. గత కొంత కాలం నుంచీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ పదే పదే రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు మన్నన్ కుమార్ మిశ్రా.
సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పూర్తి చదవాలని, దాని పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగాన్ని ప్రస్తావించడంలో తప్పు లేదని కానీ ప్రజలలో ప్రదర్శించడం, లోక్ సభలో దానిని ఒక సాకుగా చూపించడం మంచి పద్దతి కాదన్నారు.
“రాజ్యాంగం సురక్షితమైనది, గౌరవ ప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ చేతుల్లో రిజర్వేషన్లు సురక్షితం” అని మన్నన్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రయోజనాల కోసం అమాయకులను లేదా నిరక్షరాస్యులను తప్పు దారి పట్టించడం దేశ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందన్నారు.