కమలా హారీస్ గెలుపొందడం ఖాయం
మద్దతు ప్రకటించిన మాజీ చీఫ్ ఒబామా
అమెరికా – యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. తనతో పాటు తన భార్య మిచెల్ ఒబామా కలిసి అనుకోకుండా కాబోయే అధ్యక్షురాలు కమలా హారీస్ ను సర్ ప్రైజ్ చేశామని తెలిపారు. ఆమెకు తామే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా బరాక్ ఒబామా షేర్ చేశారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మాత్రమే చోటు ఉండాలని, హింసకు, ఉగ్రవాదానికి, ఆయుధాలతో తిరిగే వారికి చోటు ఉండ కూడదని తాను బలంగా నమ్ముతానని స్పష్టం చేశారు. కమలా హారీస్ కు దేశానికి అధ్యక్షురాలిగా అయ్యే అర్హత, అవకాశాలు ఉన్నాయని, పాలనా పరంగా, రాజకీయంగా , మేధో పరంగా అన్ని విధాలుగా అనుభవం కలిగి ఉన్నారని ప్రశంసలు కురిపించారు ఒబామా.
ఆమె యునైటెడ్ స్టేట్స్ కు అద్భుతమైన అధ్యక్షురాలి కాబోతోందన్న నమ్మకం తనకు బలంగా ఉందన్నారు మాజీ అధ్యక్షుడు. తమ పరంగా సంపూర్ణ మద్దతు కమలా హారీస్ కు తెలియ చేస్తున్నట్లు పేర్కొ్నారు. ప్రతి ఒక్కరు ఆమెకు బేషరతుగా సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు.