మెరుగైన అమెరికా కోసం మద్దతు ఇవ్వండి
పిలుపునిచ్చిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
అమెరికా – అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెలలో ఎవరు గెలుస్తారనేది తేలి పోనుంది. ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది ప్రచారం. ఓ వైపు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా మరో వైపు ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీలో ఉన్నారు.
కమలా హారీస్ తరపున మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమెను గెలిపిస్తేనే అమెరికాకు భవిష్యత్తు ఉంటుందని ప్రకటించారు. లేకపోతే అంధకారం తప్ప మరోటి ఉండదని హెచ్చరించారు.
స్వేచ్ఛ, సమానత్వం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, ఆరోగ్య, సామాజిక భద్రత కావాలని అనుకుంటే కమలా హారీస్ కు ఓటు వేయాలని కోరారు బరాక్ ఒబామా. అమెరికన్లకు శాంతి కావాలో లేక హింసోన్మాదాన్ని నమ్ముకున్న ట్రంప్ కావాలో తేల్చు కోవాలని పిలుపునిచ్చారు బరాక్ ఒబామా. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని అమెరికన్లు అంటున్నారు.
ప్రస్తుతం అమెరికా పతనం అంచున ఉందని, దానికి పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్. మొత్తంగా ఈ ఎన్నికలు కమలా హారీస్ కంటే ట్రంప్ వర్సెస్ ఒబామాగా మారి పోయాయి.