NEWSINTERNATIONAL

క‌మ‌లా హారీస్ కు మ‌ద్ద‌తు ఇవ్వండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన మాజీ చీఫ్ బ‌రాక్ ఒబామా

అమెరికా – అమెరికా దేశంలో అధ్య‌క్ష ఎన్నిక‌లపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఎవ‌రు ఈసారి గెలుస్తార‌నే దానిపై చ‌ర్చోప చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా గ‌తంలో ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో త‌మ పార్టీ పూర్తిగా నెర‌వేర్చింద‌ని తెలిపారు అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా.

ఆయ‌న ఈసారి ప్ర‌త్య‌ర్థిగా ఉన్న మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. హింస‌ను న‌మ్ముకుని పాల‌న సాగించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న‌కు ఓటు వేస్తే అమెరికా మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా త‌యార‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీలో ఉన్న ప్ర‌స్తుత అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ కు బేష‌ర‌తుగా ప్ర‌తి ఒక్క‌రు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఈ దేశం బాగుండాలంటే ఆమెను ఎన్ను కోవాల‌ని సూచించారు బ‌రాక్ ఒబామా.

క‌రోనా లాంటి మ‌హ‌మ్మారి వ్యాధుల నుంచి అమెరికా ఎన్నో పాఠాలు నేర్చుకుంద‌ని,ఈ సంద‌ర్బంగా ఆనాడు ఇండియా చేసిన సాయం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు మాజీ అధ్య‌క్షుడు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఔష‌ధాల ధ‌ర‌ల‌ను ప‌రిమితం చేయ‌డం , గృహ కొనుగోలుదారుల‌కు ఆర్థిక సాయం చేయ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు బ‌రాక్ ఒబామా.