కమలా హారీస్ నాయకత్వం అమెరికాకు అవసరం
పిలుపునిచ్చిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో బరాక్ ఒబామా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే అమెరికాకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు..అందరికీ మెరుగైన, సమాన అవకాశాలు ఉన్నాయి.
అమెరికా మరింత అభివృద్ది చెందాలన్నా, ముందుకు వెళ్లాలంటే, అందరికీ ఉపాధి అవకాశాలు లభించాలంటే ప్రస్తుతం తమ పార్టీ తరపున బరిలో ఉన్న అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు బరాక్ ఒబామా.
అమెరికాలోని ప్రజలందరి మేలు కోసం ఎంతగానో కష్ట పడుతున్నారని, ఇప్పటికే వారి బాగు కోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని చెప్పారు. కమలా హారీస్ గెలవడం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమని స్పస్టం చేశారు మాజీ దేశ అధ్యక్షుడు.
ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎవరిని ఎన్నుకోవాలని అనేది మీ ఇష్టం. కానీ శాంతి వైపు ఉంటారా లేక హింసను ప్రోత్సహించి, ఉద్రేక పరిచి, వినాశనం కోరుకునే వారి వైపు ఉంటారా అన్నది మీరే తేల్చు కోవాలని అన్నారు బరాక్ ఒబామా.