స్వేచ్ఛతోనే ప్రజాస్వామానికి మనుగడ
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కామెంట్
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వంతంత్రం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గిని ప్రసంగించారు.
స్వేచ్చ లేదా స్వతంత్రం వల్ల మనలో ప్రతి ఒక్కరికి మన స్వంత జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కును ఇస్తుందన్నారు. మనం ఎలా పూజిస్తాం, ఎవరిని పెళ్లి చేసుకుంటాం, మన కుటుంబం ఎలా ఉంటుంది..తదితర ప్రాధాన్యతలపై నిర్ణయం తీసుకునే హక్కు మనకు దీని వల్ల కలుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం అత్యుత్తమమైనది, ఇది అమలు కావాలంటే స్వేచ్ఛ అన్నది అవసరం అని పేర్కొన్నారు బరాక్ ఒబామా. స్వేచ్ఛ లేని జీవితం, ప్రజాస్వామ్యం ఎక్కువగా మన జాలదని కుండ బద్దలు కొట్టారు. నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రం కేవలం తమ పార్టీ వల్లనే కలుగుతుందని చెప్పారు . ప్రస్తుతం జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హరీస్ కు మద్దతు ఇవ్వాలని, మీ విలువైన ఓటు ఆమెకు వేయాలని పిలుపునిచ్చారు బరాక్ ఒబామా.