ఓటు కీలకం ప్రజాస్వామ్యానికి బలం
కమలా హారీస్ కు మద్దతు ఇవ్వండి
అమెరికా – ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమని, అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హింసను నమ్ముకున్నారని , కానీ తాము శాంతితో ప్రయాణం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎవరు ఎక్కువగా అమెరికాను రక్షిస్తారో వారికే మీ విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు బరాక్ ఒబామా. శాంతితోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, హింసను నమ్ముకుంటే మిగిలేది విషాదం మాత్రమేనని పేర్కొన్నారు.
అమెరికా భవితవ్యం బాగుండాలంటే మనందరం మన కోసం అహర్నిశలు కష్టపడే మనస్తత్వం కలిగిన కమలా హారీస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. యావత్ ప్రపంచం ప్రస్తుతం మన దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ఇవాళ అమెరికా అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నెట్టి వేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, కానీ వాటిని విచ్చిన్నం చేయాలంటే కమలా గెలవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బరాక్ ఒబామా.