యుఎస్ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతి కావాలా లేక హింసను ప్రేరేపించే వారు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారో ఆలోచించు కోవాలని అన్నారు. బరాక్ ఒబామా చేసిన తాజా కామెంట్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో జరుగుతోంది. ఓ వైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలోకి దిగారు. ఇక అనారోగ్యం కారణంగా ప్రస్తుత దేశ అధ్యక్షు జోసెఫ్ బైడన్ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా అమెరికన్లు ఎంతో ఆసక్తితో ఎదురు చూసినట్టుగా ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్
అధ్యక్ష బరిలో నిలిచారు.
ఈ సందర్బంగా ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కమలా హారీస్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు మాజీ చీఫ్ బరాక్ ఒబామా. ఆయన పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, కానీ కొందరు మాత్రం అశాంతితో నింపాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతి, సమానత్వం, ప్రతి ఒక్కరికీ గౌరవం , గుర్తింపు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని..ఇవన్నీ కలగాలంటే కమలా హారీస్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు బరాక్ ఒబామా.