పోలీస్ కమిషనర్ ను ఆదేశించిన బీసీ కమిషన్
హైదరాబాద్ – హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు అగ్ని ప్రమాద ఘటనపై సీరియస్ అయ్యింది రాష్ట్ర బీసీ కమిషన్ . ఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక సమర్పించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఆదేశించారు కమిషన్ చైర్మన్ నిరంజన్. ఈ మేరకు కమిషన్ లేఖ రాసింది.
ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల లోపు ఈ రిపోర్టు అందాలని, లేక పోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరో వైపు ఘటనకు పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు ఆరోపించాయి.
బీజేపీ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ కు హారతి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాణా సంచా పేల్చారు. దీంతో బోటుకు మంటలు అంటుకున్నాయి. గణేశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అయితే తమది బాధ్యత కానే కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాయి బీజేపీ శ్రేణులు.