మే 5న ఫైనల్ మ్యాచ్ నిర్వహణ
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2025కు సంబఃధించి కీలక షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మార్చి 22 నుంచి క్రికెట్ సంబురం మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగుతుంది. తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
ఈ టోర్నీ మొత్తం దేశంలోని 13 క్రీడా ప్రాంగణలలో ఆయా జట్లు నిర్దేషించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇందులో భాగంగా 74 మ్యాచ్ లు ఆడతాయి. ఉండగా మే5వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేసింది బీసీసీఐ. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జే షా. ఈసారి గెలిచే జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్ల కలయికతో ఐపీఎల్ కొనసాగుతుంది.