వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్
ప్రకటించిన బీసీసీఐ ఎంపిక కమిటీ
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. తాజాగా కొత్తగా టీమిండియాకు హెడ్ కోచ్ గా కొలువు తీరారు భారత మాజీ క్రికెటర్ , ప్రస్తుత ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ , కోచ్ గౌతమ్ గంభీర్. తను కొన్ని కండీషన్స్ పెట్టడంతో బీసీసీఐ ఒప్పుకుంది.
పూర్తిగా తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నాడు గంభీర్. ఆయన సూచనల మేరకు శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్.
తాజాగా వెండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. జట్టులో కీలకమైన పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ కు పదోన్నతి లభించింది. శ్రీలంక టూర్ లో భాగంగా టి20 జట్టుకు తనను కెప్టెన్ గా నియమించింది.
ఇదిలా ఉండగా వన్డే జట్టుకు మాత్రం రోహిత్ శర్మను స్కిప్పర్ గా కొనసాగించింది. ఇక జట్టు పరంగా చూస్తే శర్మ కెప్టెన్ కాగా గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జట్టులో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), రిషబ్ పంత్ (డబ్ల్యుకె), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా ఆడతారు.