ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
ముంబై – భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ను వెల్లడించింది. మే 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో క్వాలిఫయర్ 2 మ్యాచ్ జూన్ 1తో పాటు జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ కు ఇదే వేదికగా జరగనున్నట్లు తెలిపారు బీసీసీఐ కార్యదర్శి జే షా. టోర్నమెంట్ వారం రోజుల పాటు నిలిపి వేయబడటానికి ముందు హైదరాబాద్, కోల్‌కతా చివరి నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లేఆఫ్‌ల కోసం కొత్త వేదికలను వాతావరణ పరిస్థితులు, ఇతర పారామితులను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ ల వేదికలను మార్చేసింది. అంతే కాకుండా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తుండడంతో మ్యాచ్ లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2 గంటల పాటు అదనంగా సమయం పెంచినట్లు స్పష్టం చేసింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయొంట్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.