హెడ్ కోచ్ రేసులో గంభీర్
బీసీసీఐ జోరుగా మంతనాలు
ముంబై – వచ్చే జూన్ లో అమెరికా, విండీస్ వేదికగా ఐసీసీ ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ జాబితాలను ప్రకటించాయి. ఇక భారత్ ఎలాగైనా ఈసారి కప్ గెలిచి తీరాలని కృత నిశ్చయంతో ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ స్కిప్పర్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు.
తన పదవీ కాలం పూర్తవుతోంది. ఎలాంటి దూకుడు లేకుండా కేవలం ఆట పైనే ఫోకస్ పెట్టే మనస్తత్వం ది వాల్ ది. కానీ అందుకు భిన్నంగా ఉండే వాళ్లను చూస్తోంది బీసీసీఐ. తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నా ఎందుకనో ద్రవిడ్ మొగ్గు చూపడం లేదని సమాచారం.
భారత జట్టుకు మెరికల్లాంటి కుర్రాలను అందించిన ఘనత ఒక్క రాహుల్ కే దక్కుతుంది. ఇండియన్ క్రికెట్ అకాడెమీకి ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు. దాని పనితీరు ఆధారంగానే మాజీ బీసీసీఐ బాస్ గంగూలీ ఏరికోరి టీమిండియా కోచ్ గా ఎంపిక చేశాడు.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం బీసీసీఐ భారత జట్టు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పలువురు భారత మాజీ క్రికెటర్లతో పాటు విదేశాలకు చెందిన మాజీలు కూడా పెద్ద ఎత్తున అప్లై చేసుకున్నారు. కానీ టీమిండియాకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్.