శాంసన్..దూబే..జైస్వాల్ కు బిగ్ షాక్
ముగ్గురు ప్లేయర్లకు మంగళం
ముంబై – బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుల్ ఫామ్ లో ఉన్నప్పటికీ కేరళ స్టార్ బ్యాటర్ , వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పర్యటించే జింబాబ్వేతో ఆడే జట్టును వెల్లడించారు బీసీసీఐ సభ్య కార్యదర్శి జే షా.
జింబాబ్వేతో జరిగే తొలి రెండు టి20లకు సంజూ శాంసన్ , శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ ను తప్పించింది. వారి స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపారని జే షా పేర్కొన్నారు.
జూలై 6వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు జింబాబ్వేకు వెళ్లే జట్టులో చేరాలని వాస్తవానికి నిర్ణయించారు, ఈ ముగ్గురూ హరారేకు బయలుదేరే ముందు మిగిలిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుతో కలిసి మొదట భారతదేశానికి వెళతారు.
జింబాబ్వేతో జరిగే 1వ & 2వ టీ20కి భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముహర్కీల్ అహ్మద్, ముహర్కీల్ అహ్మద్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (WK), హర్షిత్ రాణా