బీసీసీఐ సంచలన నిర్ణయం
ముంబై – భారత మాజీ క్రికెటర్ , ప్రముఖ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ పై వేటు పడింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 కామెంటేటర్స్ ప్యానల్ నుంచి తొలగించింది. గత కొంత కాలంగా పఠాన్ వ్యక్తిగతంగా క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల సందర్బంగా కొందరు క్రికెటర్లను పనిగట్టుకుని దూషించాడని, అనవసర వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టేలా చేశాడని ప్లేయర్లు పెద్ద ఎత్తున బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తనను తొలగిస్తున్నట్లు పేర్కొంది.
తాజాగా ఐపీఎల్ టోర్నీ కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఐపీఎల్ లో కామెంటేటర్స్ ప్యానల్ జాబితా విడుదల చేసింది. ఇందులో అనూహ్యంగా ఇర్ఫాన్ పఠాన్ పేరు లేదు. దీంతో బిగ్ షాక్ కు గురయ్యాడు మాజీ క్రికెటర్. ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించాడు. తాను కావాలని కామెంట్స్ చేయలేదని పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తనను ఐపీఎల్ కామెంటేటర్స్ ప్యానల్ తొలగించడం పట్ల బాధగా ఉన్నా వేరే ఫార్మాట్స్ చాలా ఉన్నాయని అన్నాడు. ఈ సందర్బంగా స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. నిజాలను ఎవరూ దాచలేరని కామెంట్స్ చేశాడు. మొత్తంగా పఠాన్ చర్చనీయాంశంగా మారడం విశేషం.