SPORTS

రెస్టాఫ్ ఇండియా జ‌ట్టులో సంజూకు నో ఛాన్స్

Share it with your family & friends

త‌ప్పించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

హైద‌రాబాద్ – కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. దులీప్ ట్రోఫీలో అద్భుతైమ‌న ప‌ర్ ఫార్మెన్స్ తో రాణించినా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు సెలెక్ష‌న్ క‌మిటీ. ప్ర‌ధానంగా బీసీసీఐ కావాల‌ని క‌క్ష క‌ట్టిన‌ట్టు అనిపిస్తోంది.

ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ను స్కిప్ప‌ర్ గా ఎంపిక చేసింది. దులీప్ ట్రోఫీలో సంజూ 4 ఇన్నింగ్స్‌ల్లో 196 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. 49 సగటుతో స్ట్రైక్ రేట్ తో రాణించాడు. సెంచరీ కూడా చేశాడు. జ‌ట్టును గ‌ట్టెక్కించేందుకు కృషి చేశాడు.

ఇదిలా ఉండ‌గా రెస్టాఫ్ ఇండియా కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా , సాయి సుద‌ర్శన్, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , వికెట్ కీప‌ర్లుగా ధ్రువ్ జురైల్, ఇసాన్ కిష‌న్ , మాన‌వ‌త్ సుతార్, శ‌ర‌న్ జైన్ , ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ముఖేష్ కుమార్ , య‌శ్ ద‌యాల్ , రికీ భుయ్ , శాశ్వ‌త్ రావ‌త్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , రాహుల్ చాహ‌ర్ ను ఎంపిక చేశారు.

కాగా అద్భుతంగా ఆడినా సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డంపై శాంస‌న్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే ఎంపిక చేయాల‌ని కోరుతున్నారు.