బీసీసీఐ కక్ష శాంసన్ కు శిక్ష
తీరు మారని సెలెక్షన్ కమిటీ
హైదరాబాద్ – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి అభాసు పాలైంది. ప్రధానంగా కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ పట్ల అనుసరితస్తున్న వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఇందులో భాగంగా టి20 సీరీస్ తో పాటు వన్డే సీరీస్ ను ఆడనుంది.
విచిత్రం ఏమిటంటే టి20 సీరీస్ కు సంజూ శాంసన్ ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వన్డే సీరీస్ కు మాత్రం ఎంపిక చేయలేదు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆయన బీసీసీఐ అనుసరిస్తున్న విధానం పట్ల తప్పు పడుతూ వస్తున్నారు.
జట్లను ఎంపిక చేసే సమయంలో ప్రతీసారి సంజూ శాంసన్ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా కొత్తగా హెడ్ కోచ్ గా ఎంపికైన గౌతమ్ గంభీర్ వచ్చినా ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పు లేక పోవడం గమనార్హం. మొత్తంగా శాంసన్ కెరీర్ పరంగా చూస్తే వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐ కార్యదర్శి జే షాపై ఉంది.