శుభ్ గిన్ కు లక్కీ ఛాన్స్
భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో భారత దేశంలో పర్యటించనుంది జింబాబ్వే క్రికెట్ జట్టు. ఇందులో భాగంగా ప్రస్తుతం టీమిండియా అమెరికా, విండీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ లో ఆడుతోంది.
ఇదిలా ఉండగా జింబాబ్వే జట్టు వచ్చే జూలై నెలలో భారత్ కు రానుంది. ఈ మేరకు 5 మ్యాచ్ ల టి20 సీరీస్ కు గాను భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో ఈ జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్ లో యువ ఆటగాళ్లకు బిగ్ ఛాన్స్ ఇచ్చింది.
కాగా ఎవరూ ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ కు జట్టు పగ్గాలు అప్పగించింది. విచిత్రం ఏమిటంటే తను సారథ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. కానీ తనకంటే ఎక్కువ అనుభవం కలిగిన ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకడు. కానీ అతడిని కాకుండా ముంబై లాబీ గిల్ కు దక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యింది.