SPORTS

ఎట్ట‌కేల‌కు సంజూ శాంస‌న్ కు ఛాన్స్

Share it with your family & friends

టీమిండియా టి20 జ‌ట్టులోకి చోటు

హైద‌రాబాద్ – బీసీసీఐ ఎట్ట‌కేల‌కు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇచ్చింది. శ్రీ‌లంకతో స్వ‌దేశంలో ఇప్ప‌టికే భార‌త్ టెస్టులు ఆడుతోంది. అయితే టి20 సీరీస్ అక్టోబ‌ర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్బంగా తాజాగా ప్ర‌క‌టించిన లిస్టులో శాంస‌న్ ను చేర్చ‌లేదు. మ‌రోసారి అన్యాయం జ‌రిగిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో గ‌త్యంత‌రం లేక సెలెక్ష‌న్ క‌మిటీ సంజూ శాంస‌న్ ను చేర్చింది. ఇషాన్ కిషాన్ కు బ‌దులు సంజూకు అవ‌కాశం ఇచ్చారు.

ఇక ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు శాంస‌న్ స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. త‌న జ‌ట్టులో రియాన్ ప‌రాగ్ కీల‌క‌మైన ఆట‌గాడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్ద‌రూ భార‌త జ‌ట్టుకు ప్రాత‌నిధ్యం వ‌హిస్తుండ‌డం విశేషం. దులీప్ ట్రోఫీలో అద్భుత‌మైన ఫామ్ లోకి వ‌చ్చాడు శాంస‌న్.

ఇక టి20 జ‌ట్టు ప‌రంగా చూస్తే సూర్య కుమార్ యాద‌వ్ స్కిప్ప‌ర్ కాగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (wk), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్ ఆడ‌నున్నారు.