10 పాయింట్లతో పాలసీని తీసుకు వచ్చింది
ముంబై – బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఈ మధ్యన భారత జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సీరీస్ ను కోల్పోయింది. ప్రధాన ఆటగాళ్లు ఆశించిన మేర రాణించ లేక పోయారు. మరో వైపు టాపార్డర్ పూర్తిగా వైఫల్యం చెందడం, డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడిన కామెంట్స్ బయటకు రావడంతో బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగింది. ఈ మేరకు క్రికెటర్లకు కఠిన నియమావళిని రూపొందించింది. 10 పాయింట్లతో పాలసీని ప్రకటించింది.
ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి , ఐసీసీ చైర్మన్ జే షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గంభీర్ , సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, జేషాతో పాటు ప్రెసిడెంబ్ రోజర్ బిన్నీతో కలిసి కీలక సమావేశం నిర్వహించింది.
ప్రతి క్రికెటర్ ఈ పాలసీని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ మాత్రం గీత దాటినా వేటు తప్పదని హెచ్చరించింది. దేశీవాళి టోర్నీలో ప్రతి ప్లేయర్ ఆడాల్సిందేనని పేర్కొంది. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఇందులో ప్రదర్శను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.
ఇక నుంచి విడివిడిగా కాకుండా అందరూ జట్టుతో కలిసి ప్రయాణం చేయాల్సిందేనని వెల్లడించింది. ఒకవేళ కుటుంబంతో కలిసి వెళ్లాలని అనుకుంటే ముందు హెడ్ కోచ్, కెప్టెన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తమ లగేజీకి మించి బరువు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన ఖర్చును ప్లేయర్లు భరించాల్సి ఉంటుంది. ఇక నుంచి వ్యక్తిగత సిబ్బంది విషయంలో కూడా నజర్ పెట్టింది. షెడ్యూల్ ప్రాక్టీస్ ముగిసేంత దాకా అందరు ఆటగాళ్లు ఉండాల్సిందేనని నిబంధన చేర్చింది.
టూర్స్ సందర్బంగా ప్లేయర్లు ఎలాంటి వ్యక్తిగత షూట్ లు,, ఎండార్స్మెంట్ లలో పాల్గొనేందుకు వీలు లేదు. దీని వల్ల ఆటపై ఫోకస్ పోతుందని తెలిపింది. మొత్తంగా బీసీసీఐ ఆటగాళ్లకు ముకుతాడు వేసింది