చేతికి గాయం కావడంతో దూరం
రాజస్తాన్ – రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు భారీ ఊరట లభించింది. తను ఇప్పటి వరకు ఐపీఎల్ 2025 టోర్నీ 18వ సీజన్ లో ప్రత్యేక బ్యాటర్ గా కొనసాగుతూ వచ్చాడు. దీనికి కారణం తన చేతికి గాయం కావడం. దీనిని సీరియస్ గా తీసుకుంది బీసీసీఐ. ఈ మేరకు తను మూడు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మెరుగైన చికిత్స తీసుకోవడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో టెస్ట్ నిర్వహించారు. అక్కడ రిపోర్ట్ లో ఏమీ లేదని తేలింది. లైన్ క్లియర్ ఇచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్ లకు తను రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటి దాకా రియాన్ పరాగ్ స్టాండింగ్ స్కిప్పర్ గా ఉన్నాడు.
ఇదిలా ఉండగా గాయం కారణంగా నాయకత్వ బాధ్యతలతో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయొద్దంటూ బీసీసీఐ ఆదేశించింది. తాజాగా లైన్ క్లియర్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్. ఇప్పటి వరకు టోర్నీలో పేలవమైన ప్రదర్శన చేసింది జట్టు. ఈ టీంకు రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. కుమార సంగక్కర డైరెక్టర్ గా ఉన్నాడు. మూడు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. కాగా లీగ్ లో భాగంగా ఏప్రిల్ 5న శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో కీలక మ్యాచ్ జరగనుంది.