భవిష్యత్తులో మరింత ఎదగాలి
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి , ఐసీసీ చైర్మన్ జే షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన యంగ్ క్రికెటర్ ఉర్విల్ పటేల్ ను ప్రశంసలతో ముంచెత్తారు. బుధవారం గుజరాత్, త్రిపుర జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్బంగా అరుదైన ఘనత సాధించాడు ఉర్విల్ పటేల్.
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. గతంలో ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఫాసెస్ట్ సెంచరీ చేశాడు. భారతదేశ ఆటగాడి ద్వారా ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన టి20 సెంచరీని నమోదు చేయడం విశేషం. ఈ సందర్బంగా జే షా ఆయనను కొనియాడారు.
మొత్తం మీద రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బీసీసీఐ కార్యదర్శి. ఈ యువకుడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు జే షా. ఆయనతో పాటు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ కూడా ప్రశంసించారు ఉర్విల్ పటేల్ ఆట తీరును.
దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు బద్దలవడం నిజంగా గొప్ప క్షణమే అంటూ పేర్కొన్నారు.