టెస్టు క్రికెట్ పై ఫోకస్ పెడతాం – జే షా
స్పష్టం చేసిన బీసీసీఐ సెక్రటరీ
ముంబై – బీసీసీఐ కార్యదర్శి, ఐసీసీ చైర్మన్ జే షా కీలక వ్యాఖ్యలు చేశారు . గత కొంత కాలంగా టెస్టు క్రికెట్ నిరాదరణకు గురవుతోందని క్రికెట్ వర్గాలతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో జే షా స్పందించారు.
టెస్టు క్రికెట్ మ్యాచ్ లకు , ఫార్మాట్ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగేలా చేస్తామని , ఆ దిశగా ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు జే షా. క్రికెట్ అనేది ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ఆదరణ కలిగిన ఆటలలో ఒకటిగా ఉందన్నారు.
టెస్టు క్రికెట్ ను మరింత ఆడేలా, ప్రోత్సహించేలా బీసీసీఐతో పాటు ఐసీసీ కూడా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డామన్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ మరింత ఉత్కంఠను రేపిందన్నారు. ఇలాంటి మ్యాచ్ లు మరింత చూసేలా చేస్తాయని పేర్కొన్నారు జే షా.
టెస్టు ఫార్మాట్ స్థాయిని పెంచేందుకు తాను తప్పకుండా కృషి చేస్తానని అన్నారు . ఇదే సమయంలో మహిళా క్రికెట్ అభివృద్ది కూడా చేస్తామన్నారు.