టి20 వరల్డ్ కప్ టీంపై ఉత్కంఠ
కొనసాగుతున్న సెలెక్టర్ల కసరత్తు
ముంబై -అందరి కళ్లు ఇప్పుడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై ఫోకస్ పెట్టాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2024 నడుస్తోంది. యువ ఆటగాళ్లు ఈసారి లీగ్ సీజన్ లో దుమ్ము రేపుతున్నారు. సత్తా చాటుతుండడంతో ఎంపిక ప్రక్రియ మరింత ఇబ్బందికరంగా మారింది. గాయం కారణంగా ఆటకు దూరమై తిరిగి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ తో పాటు వికెట్ కీపర్ గా ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రతీసారి కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో చాలా కూల్ గా కెప్టెన్సీ నిర్వహిస్తూనే జట్టుకు అద్భుత విజయాలు సాధించేలా ముందుండి నడిపిస్తున్నాడు . ఇదే సమయంలో అత్యధిక పరుగుల రేసులో కూడా తను ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించి రియాన్ పరాగ్ , అశుతోష్ శర్మ ను కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేక పోలేదు.
ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్ కోసం పోటీ పడుతున్నాడు. ఎప్పటి లాగే రిషబ్ పంత్ , శాంసన్ , కేఎల్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.