పాకిస్తాన్ కు టీమిండియా వెళ్లదు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షాక్
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ లో వచ్చే ఏడాది 2025లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి తమ జట్టు వెళ్ల బోదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇప్పటికే లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని, తమ ఆటగాళ్లకు పాకిస్తాన్ లో భద్రత అనేది ఉండదని తాము భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే భారత జట్టును పంపించ బోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచంలో ఎక్కడైనా పాకిస్తాన్ కాకుండా తటస్థ వేదికలలో నిర్వహిస్తే తాము ఒప్పుకుంటామని తెలిపింది ఐసీసీకి.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి లేఖ కూడా రాసినట్లు టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని కోరింది. దీనిపై ఇంకా ఐసీసీ స్పందించ లేదు. మొత్తంగా పాకిస్తాన్ కు భారత జట్టు వెళ్లదని తేలి పోయింది. ఇదిలా ఉండగా ఎలాగైనా సరే ఇండియా టీమ్ ను రప్పించాలని కోరుతోంది పీసీబీ.