సత్తా చాటిన బీడీ కార్మికుడి కొడుకు
సివిల్స్ లో దేశ వ్యాప్తంగా 27వ ర్యాంకు
కరీంనగర్ జిల్లా – ఎలాంటి కోచింగ్ లేకుండా స్వశక్తితో సివిల్స్ లో సత్తా చాటాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఏకంగా సివిల్స్ లో దేశ వ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకులలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన బీడీ కార్మికుడి కొడుకు నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించాడు.
విచిత్రం ఏమిటంటే తను ఎవరిపై ఆధారపడలేదు. కేవలం తనంతకు తానుగా చదువుకున్నాడు. ముందు నుంచి తను కలెక్టర్ కావాలన్నది కోరిక. దానిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేశాడు. అనుకున్నది సాధించాడు ఈ పేదోడి బిడ్డ.
సాయి కిరణ్ కరీంనగర్ లోని తేజ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. 2012లో పదవ తరగతి పాసయ్యాడు. ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేసాడు . వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశాడు. అనంతరం క్వాల్ కామ్ కంపెనీలో ఇంజనీర్ గా చేశాడు.
ఓ వైపు జాబ్ చేసుకుంటూనే మరో వైపు కోచింగ్ కు వెళ్లలేదు. స్వంతంగానే నోట్స్ తయారు చేసుకున్నాడు. కేవలం ఇంటర్నెట్ పైనే ఆధారపడ్డాడు నందాల సాయి కిరణ్. అతడి తల్లిదండ్రులు కాంతా రావు, లక్ష్మి. ఇద్దరూ చాలా ఏళ్ల పాటు బీడీ కార్మికులుగా పని చేశారు.