బెన్‌ఫిట్ షోలు..టికెట్ రేట్ల పెంపు ఉండదు
ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని కంట్రోల్ కమాండ్ ఆఫీసులో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదన్నారు. సమస్యల పరిష్కారానికి ముందుంటామని అన్నారు.
తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామన్నారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. . పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. లేక పోతే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సీఎంతో జరిగిన భేటీలో ప్రముఖ నటులు నాగార్జున, వెంకటేశ్ , నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ , దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి,అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్ , ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ హాజరయ్యారు.