NEWSNATIONAL

గ‌వ‌ర్న‌ర్ మొబైల్ కంట్రోల్ రూమ్

Share it with your family & friends

ఏర్పాటు చేసిన సీవీ ఆనంద బోస్

ప‌శ్చిమ బెంగాల్ – కోల్ క‌తా ట్రైనీ డాక్ట‌ర్ అత్యాచారం, హ‌త్య చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. వైద్యులు విధుల‌కు హాజ‌రు కావ‌డం లేదు. ప్ర‌స్తుతం పాల‌నా ప‌రంగా చేతులెత్తేసింది ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం.

ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేయ‌డం, ఆ వెంట‌నే మ‌రో కాలేజీలో జాయిన్ కావ‌డం ప‌లు అనుమానాలకు తావిస్తోంది. ఇదే బాలిక రేప్, మ‌ర్డ‌ర్ కు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుమోటాగా కేసు స్వీక‌రించింది.

మంగ‌ళవారం సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ బాధ్య‌తా రాహిత్యాన్ని ప్ర‌శ్నించింది. ఇదే స‌మ‌యంలో ఆర్జీ కార్ మెడిక‌ల్ కాలేజీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రైనా వివ‌రాలు తెలియ చేయాల‌ని అనుకుంటే అట్టి వారి కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్.

03322001641, 9289010682 నంబర్‌లతో మొబైల్ కంట్రోల్ రూమ్‌ను స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్ ఇవాళ‌ ప్రారంభించారు. .ఎవరైనా HGకి ఏదైనా తెలియ జేయాలనుకుంటే ఆ నంబర్‌లకు కాల్ చేయవచ్చ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా వైద్యురాలి తండ్రిని , కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.