Tuesday, April 22, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

తిరుమ‌ల‌లో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

11న విజేత‌ల‌కు బ‌హుమ‌తులు

తిరుమ‌ల – గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి. 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో రెండు కేటగిరీలలో అనగా 18 సంవత్సరాల వారు ఒక కేటగిరి, 18 సంవత్సరాల పైవారు రెండవ కేటగిరి గాను, 6వ అధ్యాయం ఆత్మ సంయమామ యోగంలో 6, 7 తరగతి ఒక కేటగిరి గాను, 8,9 తరగతులు రెండవ కేటగిరి గాను పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు టిటిడి విద్యాసంస్థలు, తిరుపతిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి 139 మంది విద్యార్థులు హాజరయ్యారు.

6 – 7 తరగతులకు సంబంధించి ప్రథమ విజేత కె. స్వాతి, ద్వితీయ విజేత కె.భూమి, తృతీయ విజేతగా కె.సహస్త్ర నిలవగా, 8-9 తరగతులకు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కె.నందిని, కె.నాగమశ్లీశ్వరి, ఎం.వైష్ణవి కైవసం చేసుకున్నారు.

18 సంవత్సరాలు పైబడిన విద్యార్థుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా కె.వి.లక్ష్మీదేవి, ఎం.ఎస్.జ్యోతి, పి.హేమ వెంకట నారాయణ నిలువుగా, 18 సంవత్సరాలు లోపు విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా కె.పి.శ్రీముకుంద, జీ.జీవన్ శ్రీనివాస్, ఎం.నీరజ వర్ధన్ నిలిచారు.

విజేతలకు ఈ నెల 11వ తేదీన‌ తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో బహుమతులను ప్రదానం చేయనున్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments