ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
సీఎం భగవంత్ మాన్ ఆందోళన
పంజాబ్ – రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు సామాన్యులు బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ కొలువు తీరాక ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడిందని వాపోయారు సీఎం.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే పనిలో ప్రధానమంత్రి బిజీగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజలు ఇకనైనా మేల్కోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు భగవంత్ మాన్.
ఈ పదేళ్ల కాలంలో కేవలం కొద్ది మంది వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేస్తూ వచ్చారని అన్నారు . దేశంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని, వనరులను విధ్వంసం చేశాడని ఆరోపించారు సీఎం.
ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ విలువైన ఓటును వినియోగించు కోవాలని సూచించారు . లేక పోతే మరింత బతుకు భారంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఆప్ ను అడ్రస్ లేకుండా చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు.