భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని మూవీ
పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం
హైదరాబాద్ – ప్రముఖ నటుడు రామ్ పోతినేని, లవ్లీ గర్ల్ భాగ్యశ్రీ బోర్సే కలిసి కొత్త సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి గురువారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు హాజరయ్యారు. ఇక నటీ నటులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
రామ్ పోతినేని గతంలో బోయపాటి శ్రీనివాస్ తో చేయగా హరీశ్ శంకర్ రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీలో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ముంబై ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ఫిల్మీ మహేష్ దర్శకత్వం వహించనున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కథ, దర్శకత్వం , స్క్రీన్ ప్లే అంతా ఫిల్మీ మహేష్ చూసుకుంటారు. ఫుల్ ఎనర్జీ తో ఉండే రామ్ తో బోర్సే కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది రామ్ అభిమానుల్లో.
ఏది ఏమైనా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ రికార్డ్ సృష్టించారు. వీరి సారథ్యంలోనే బన్నీ నటించిన పుష్ప2 డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.