NEWSTELANGANA

రాష్ట్రంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి

Share it with your family & friends

స‌హ‌కారం అందిస్తామ‌న్న భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ పెట్టాల‌ని సూచించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌న‌రులు, స‌హాయ స‌హ‌కారాలను ప్ర‌భుత్వం త‌ర‌పున అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు .

గురువారం సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. బీఈఎంఎల్ కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు.

మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సిఎండి శంతను రాయ్ వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్డ్ లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పని చేస్తున్నట్టు వివరించారు.

హైదరాబాదులో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు. హైదరాబాదులో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు సీఎండీ తెలిపారు.