11 లక్షల రైతులకు రుణ మాఫీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవాళ రైతులంతా రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం వారి కళ్లల్లో ఆనందం కనపించేలా చేసిందన్నారు భట్టి విక్రమార్క.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం జరుగుతోందన్నారు. తొలి విడతగా లక్ష రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఆగస్టు నెలాఖరు లోపు మరో లక్ష రూపాయలను మాఫీ చేస్తామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అయితే రైతుల ఖాతాల్లో వేస్తున్న డబ్బులను రుణ మాఫీ కోసం మాత్రమే వాడాలని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఆగటస్టు దాటక ముందే రూ. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. మొత్తంగా 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.