NEWSTELANGANA

ఆందోళ‌న చెందొద్దు అండ‌గా ఉంటాం – భ‌ట్టి

Share it with your family & friends

భారీ ఎత్తున తెలంగాణ‌కు న‌ష్టం

హైద‌రాబాద్ – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు, వ‌ర‌ద బీభ‌త్సానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా సాయం చేస్తోంద‌ని చెప్పారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది ప్రాణాలు కోల్పోయాని, భారీ ఎత్తున న‌ష్టం సంభ‌వించింద‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తాత్కాలిక అంచనా ప్ర‌కారం రూ. 5438 కోట్ల మేర న‌ష్టం ఏర్ప‌డింద‌న్నారు. వెంట‌నే కేంద్ర స‌ర్కార్ స్పందించాల‌ని, సాయం చేయాల‌ని కోరారు డిప్యూటీ సీఎం.

ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేయాలని ప్రయత్నించామ‌ని అన్నారు. కానీ కొంద‌రి ప్రాణాల‌ను కాపాడాలేక పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . ముంపు బాధితులను ఆదుకుంటామ‌ని చెప్పారు. ఈ న‌ష్టాన్ని జాతీయ విప‌త్తుగా కేంద్రం ప్ర‌క‌టించాల‌ని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా కన్నా తెలంగాణలోని ఖమ్మంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఆవేద‌న చెందారు .

ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటుందన్నారు.