చెరువులు మాయం పెను ప్రమాదం – భట్టి
హైడ్రా పేరుతో సర్కార్ పై ఆరోపణలు తగదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవలే అమెరికా, జపాన్ దేశాలలో పర్యటించి తిరిగి వచ్చారు. వివిధ శాఖలపై రివ్యూ చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో సోమవారం భట్టి విక్రమార్క హైడ్రాపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
హైడ్రాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు తమ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ను తూల నాడుతున్నారని, అనరాని మాటలు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క. తమది కూల్చే సర్కార్ కాదన్నారు. కేవలం మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కూల్చుతున్నామని చెప్పారు. తమది ప్రజలకు సంబంధించిన పాలన అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
ప్రజల ఎజెండానే కానీ వ్యక్తిగత ఎజెండా అంటూ తమకు లేదన్నారు . తప్పుడు ఆరోపణలు, నిరాధారమైన విమర్శలతో ప్రజలను రెచ్చ గొడుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అన్నారు.
హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయని వాపోయారు మల్లు భట్టి విక్రమార్క. చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదంగా మారనుందని హెచ్చరించారు.