నోటిఫికేషన్ విడుదల చేస్తాం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులు రాజకీయాలకు బలి కావద్దని కోరింది. మరో డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే 11 వేల ఉపాధ్యాయ ఖాళీల డీఎస్సీ ని సక్రమంగా వినియోగించు కోవాలని కోరారు. అనవసరంగా తమ విలువైన కాలాన్ని నిరుపయోగం చేసుకోవద్దని సూచించారు మల్లు భట్టి విక్రమార్క.
త్వరలోనే దాదాపు 5 నుండి 6 వేల ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. మీరంతా తెలంగాణ బిడ్డలని, మీరు బాగు పడాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని, చిల్లర రాజకీయాలకు బలి కావద్దని హితవు పలికారు.