NEWSTELANGANA

యాదాద్రి ఘ‌ట‌న భ‌ట్టి స్పంద‌న

Share it with your family & friends

కావాల‌నే చిన్న స్టూల్ పై కూర్చున్నా

హైద‌రాబాద్ – యాద‌గిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ఆల‌యం సాక్షిగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కకు ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి కావాల‌ని అవ‌మానించార‌ని, వెంట‌నే ద‌ళిత జాతికి, తెలంగాణ స‌మాజానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మేధావులు, బుద్ది జీవులు , సామాజిక కార్య‌క‌ర్త‌లు, ద‌ళిత సంఘాలు కోడై కూస్తున్నాయి. సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

దీంతో ప‌రిస్థితి మ‌రింత తీవ్రం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో యాదాద్రిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్వి్ట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను తెలియ చేశారు.

తాను కావాల‌నే చిన్న స్టూల్ పై కూర్చోవ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు భ‌ట్టి. ఆ ఫోటోను ప‌నిగ‌ట్టుకుని ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నాన‌ని తెలిపారు. తాను ఎవ‌రికీ త‌ల‌వంచే వాడిని కాన‌ని స్ప‌ష్టం చేశారు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఎవ‌రో ప‌క్క‌న కూర్చో బెడితే కూర్చునే వాడిని కాద‌న్నారు. తాను ఆత్మ గౌర‌వాన్ని చంపుకునే వ్య‌క్తిని కాన‌ని స్ప‌ష్టం చేశారు.