రూ. 66,507 కోట్లు ఖర్చు చేశాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – తమపై పదే పదే బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ , బీజేపీ నేతలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆయన శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాకం కారణంగా ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉందన్నారు. అయినా అష్టకష్టాలు పడి ఇప్పటి వరకు రూ. 66,507 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ కు ఒక అలవాటుగా మారిందని ఆరోపించారు భట్టి. ఖర్చు చేసిన ఈ 66 వేల 507 కోట్లలో రూ. 22,328 కోట్లు కేవలం జీతాల చెల్లించేందుకే కేటాయించామన్నారు. ఇక రూ. 26 వేల 374 కోట్లు అప్పుల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు మల్లు భట్టి విక్రమార్క.
మిషన్ భగీరథ, సీడీఎంఏ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బికి సంసిద్ధత, నీటి సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి రూ. 170 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రైతు బంధు కింద 64,75,319 మంది రైతులకు రూ. 5,575 కోట్లు చెల్లించామని చెప్పారు. అంతే కాకుండా రైతు బీమా కింద రూ. 734 కోట్లు ఇచ్చామన్నారు.