NEWSTELANGANA

కుల‌గ‌ణ‌న‌లో తెలంగాణ రోల్ మోడ‌ల్ కావాలి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లోనే కుల గ‌ణ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం స‌చివాల‌యంలో ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

కుల గ‌ణ‌న చేప‌ట్ట‌డంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా ఉండేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు ప‌ట్టం క‌డుతామ‌ని చెప్పారు.

కులగణన పై సామాజిక వేత్తలు, మేధావులతో కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

బీసీ సంక్షేమం అభ్యున్నతి పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.