రూ. 20 వేల కోట్ల రైతు రుణ మాఫీ
ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – అధికారం చేపట్టిన మొదటి ఏడాది లోనే రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 2014-18 కాలంలో 4 దఫాలుగా రుణ మాఫీ చేస్తే వడ్డీలకే వాళ్లు ఇచ్చిన డబ్బులు సరి పోయాయంటూ ఎద్దేవా చేశారు.
గురువారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సర్కార్ వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. తాము వచ్చాక తలతోక ప్రాణానికి వచ్చిందన్నారు. రైతుల ఖాతాలో అసలు అలాగే ఉండి పోయిందన్నారు.
2018-23 లో మళ్లీ లక్ష రుణ మాఫీ చేస్తామని చెప్పి చివరి సంవత్సరంలో గాలికి వదిలి వేశారంటూ ఆరోపించారు. పదేళ్ళలో కనీసం రూ. లక్ష రుణ మాఫీ కూడా చేయలేక పోయారని అన్నారు. ప్రస్తుతం తాము ప్రజా పాలన సాగిస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏదైనా ఉంటే ఆధారాలతో తమకు అందజేయాలే తప్పా బద్నాం చేసే పని మానుకోవాలని సూచించారు మల్లు భట్టి విక్రమార్క.