కేసీఆర్ లేఖపై భట్టి ఫైర్
కమిషన్ ముందుకు వస్తే తప్పేంటి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి స్పందించారు భట్టి. ఈ వ్యవహారానికి సంబంధించి లేఖ రాయడంపై మండిపడ్డారు.
ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇలాగేనా వ్యవహరించేది అంటూ నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని పేర్కొన్నారు. మాజీ సీఎం తన పద్దతిని మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందుకు రావాలని ఆదేశిస్తే రాక పోవడం దారుణమన్నారు. కమిషన్ ముందుకు వస్తే వచ్చే నష్టం ఏమిటని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోరిక మేరకే తాము విద్యుత్ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మరి మీరు కోరినా వేసిన కమిషన్ ముందుకు హాజరు కాక పోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.