హరీశ్ రావు అబద్దాలకు కేరాఫ్ – భట్టి
రైతులకు విరివిగా రుణాలు ఇవ్వండి
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్దాలు తప్పా నిజాలు ఒక్కటి కూడా ఉండవన్నారు. భట్టి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పిన లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతు రుణ మాఫీ కింద రూ. 18,000 కోట్లు ఇచ్చిందన్నారు.
కొత్తగా ఇచ్చే రుణాలు ఇప్పటి వరకు రూ. 7500 కోట్ల వరకు మాత్రమే రైతులకు బ్యాంకుల ద్వారా ఇచ్చినట్లు తెలిపారు. బ్యాంకర్లు అందరూ రైతుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని కోరారు డిప్యూటీ సీఎం.
దీని వల్ల రైతులందరికి సకాలంలో వ్యవసాయం చేసుకోడానికి వీలవుతుందన్నారు. తద్వారా రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు. అయితే ఈ విషయం పూర్తిగా వినిపించు కోకుండా మాజీ మంత్రి హరీశ్ రావు లేనిపోని అసత్య ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మల్లు భట్టి విక్రమార్క.
తాను మాట్లాడిన దాంట్లో కొంచెం భాగం మాత్రమే తీసుకొని అబద్ధం చెప్పడం న్యాయమేనా అని ప్రశ్నించారు. మీరు పదేళ్ల పాటు చేసిన పాలనలో అన్నీ మోసాలే ఉన్నాయని, అందుకే మిమ్మల్ని ఓడించారంటూ ఎద్దేవా చేశారు .